navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 2:00 pm Digital Edition : NAVAGEETAM

చెప్యాల అంగన్వాడి కేంద్రంలో వసంత పంచమి వేడుకలు

నవగీతం,కొడిమ్యాల

కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాన్ని పూలతో, పసుపు రంగు అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు.వసంత పంచమి సందర్భంగా విద్యా దేవత శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, చిన్నపిల్లల విద్యాభ్యాసానికి అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల మానసిక, విద్యా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పిల్లలకు స్వీట్లు, ప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత రాజశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ సాయికుమార్ వార్డు సభ్యులు నవ్య .ఆంజయ్య కార్యదర్శి స్వామి. అంగన్వాడి కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు .