navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 3:57 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా ఖాదీ కార్మికులకు ఘన సన్మానం

మెట్‌పల్లి, ఆగస్టు 7(నవగీతం):జాతీయ చేనేత కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెట్‌పల్లి పట్టణంలోని ఖాదీ ప్రతిష్ఠాన్‌లో సేవలందిస్తున్న కార్మికులు మచ్చ అశోక్, రాజేందర్‌లను ఘనంగా సన్మానించారు.బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మెల శంకర్, శాలువాలు కప్పి వారిని సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులు దేశ సంప్రదాయ వస్త్ర సంస్కృతిని కాపాడుతూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బొమ్మెల శివ, చిన్నయ్య, రమేష్, ఖాదీ ప్రతిష్ఠాన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.