navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 4:32 pm Digital Edition : NAVAGEETAM

జగిత్యాలకు త్వరలో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం

బిజెపి రాష్ట్ర నాయకులు బోగ శ్రావణి

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.శనివారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి తో కలిసి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ని న్యూ ఢిల్లీలోని వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల ప్రజల దీర్ఘకాలిక అవసరమైన ప్రత్యేక పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుపై విజ్ఞప్తి పత్రాన్ని బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి అందజేశారు.ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించి, జగిత్యాల జిల్లాలో పాస్‌పోర్ట్ సేవల అవసరాన్ని గుర్తించి, త్వరలోనే (పి.ఓ.పి.ఎస్.కె) ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటుతో జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి