navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 8:05 pm Digital Edition : NAVA GEETAM

జగిత్యాల కలెక్టరేట్  పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల,అక్టోబర్26,(నవగీతం)

జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జగిత్యాల కలెక్టరేట్ ప్రభుత్వ పెట్రోల్ బంక్ ను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ప్రారంభించారు.

ఐ.డి ఓ.సి. ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్ చౌరస్తాకు వచ్చే ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, వాహనదారులకు ఇంధనాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌లో నాణ్యత ప్రమాణాలు, సరైన కొలతలు, భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని, పెట్రోల్ బంక్ నిర్వహణలో పారదర్శకత పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించడంతో పాటు, వాహనదారులకు సౌకర్యవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారి కె వై ప్రసాద్ (డీఆర్ఓ), ఆర్డీఓ మధుసూదన్, కలెక్టరేట్ ఏఓ కిషన్, జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు, పెట్రోల్ బంక్‌కు సంబంధించిన అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.