జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి

ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల,ఆగస్టు24,(నవగీతం):జగిత్యాల రూరల్ మండలం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ప్రజల నుండి అందుతున్న వినతులు, ఫిర్యాదుల స్వీకరణ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉదేశ్యం తో గత వారం నుండి మండల స్థాయిలో ప్రజా వాణి కార్యక్రమాలు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును...