జనగణన–2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జనగణన–2027 కార్యక్రమం నిర్వహణలో భాగంగా తొలి దశలో నిర్వహించనున్న హౌస్‌లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ కు సంబంధించి జిల్లా, చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం జగిత్యాల జిల్లా ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజల నివాస గృహాల వివరాలు, మౌలిక సదుపాయాల స్థితి, కుటుంబాల...