జనసేన సభ్యత్వ నమోదుకు శ్రీకారం..!
పార్టీ శ్రేణులను మూడు రకాలుగా విభజించిన జనసేనాని : ఉద్యమి, సాధక్, ప్రధాత. రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్ నవగీతం, మంగళగిరి: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని,పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు,ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి...