navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:07 pm Digital Edition : NAVA GEETAM

జమ్మిగద్దె నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్

మల్లాపూర్, అక్టోబర్ 7 (నవగీతం): మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జమ్మిగద్దె నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం జరిగింది.

జమ్మిగద్దె నిర్మాణానికి దాతగా ముందుకు వచ్చిన గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్యకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు జక్కుల రాజేందర్, అంతడుపుల గంగాధర్, పాల్తేపు రాజారెడ్డి, మారు శేఖర్ రెడ్డి, విజయ్, తిరుపతి, రాజం, నరేష్, స్వామి, లింగం, నారాయణ, సంతోష్, శేఖర్, క్రాంతి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.