జమ్మిగద్దె నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్
మల్లాపూర్, అక్టోబర్ 7 (నవగీతం): మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జమ్మిగద్దె నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. జమ్మిగద్దె నిర్మాణానికి దాతగా ముందుకు వచ్చిన గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్యకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ...