జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే ఊరుకోం !

కల్లేడ నరేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం రాజకీయ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి నవగీతం, హైదరాబాద్: సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ, రాత్రింబవళ్లు శ్రమిస్తున్న జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TDWJF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్ రాజకీయ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, జర్నలిస్టుల పట్ల రాజకీయ నాయకులు తమ వైఖరిని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మరియు...