జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో రాయితీ కల్పించాలి
ప్రజావాణిలో టియూడబ్ల్యూజే ఐజేయు నాయకుల వినతి నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50% రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా జర్నలిస్టు యూనియన్ (ఐజేయు) పక్షాన సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలను ఆదేశించాలని డిఈవో రాముకు సూచించారు. సమస్య తెలుపగానే తక్షణం స్పందించిన అదనపు కలెక్టర్ కు జర్నలిస్టులు యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు....