జిల్లాలో డాక్టర్ రఘు సుడిగాలి పర్యటన
నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో శనివారం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు సుడిగాలి పర్యటన జరిపారు. రాయికల్ ఇటిక్యాలకు చెందిన అనుపురం నాగేశ్ గౌడ్ రేవతి కుమారుని వివాహం శనివారం జరగగా డాక్టర్ రఘు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాయికల్ లోని జగిత్యాల రోడ్డులో గల జీజీ గార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్ గౌడ్, నందం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రేండ్ల...