జిల్లాలో 5 మున్సిపాలిటీలలో ప్రశాంతంగా పోలింగ్

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ధర్మపురి, జగిత్యాల, మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపల్ కేంద్రంల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 5 మున్సిపాలిటీలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాటు చేసిన సదుపాయాలు, పోలింగ్ సామగ్రి వినియోగం, బ్యాలెట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్ల పనితీరును సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న తీరు గురించి వివరాలు తెలుసుకుని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని...