navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 4:16 pm Digital Edition : NAVAGEETAM

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఇట్టేడి రాజు

నవగీతం, జగిత్యాల:

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులై ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇట్టేడి రాజు, జగిత్యాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అశోక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజా సేవ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ చేస్తున్న సేవలను కొనియాడుతూ, పరస్పర సహకారంతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల బీజేవైఎం అధ్యక్షుడు పందిరి నాగరాజు, బీజేవైఎం నాయకుడు వాకిటి తిరుపతి రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.