జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ

జగిత్యాల,అక్టోబర్14,(నవగీతం): జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఎన్. ప్రసూనాంబ బుధవారం బాధ్యతలు స్వీకరించగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బాధ్యతలను సమర్ధవంతంగా ప్రజలతో మమేకమై నిర్వర్తించాలని జిల్లా కు రాష్ట్ర స్థాయి లో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. అనంతరం జిల్లా పరిపాలన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.