జిల్లా పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు:
ఎస్పీ అశోక్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా, కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పీ వివిధ ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన...