navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 2:15 pm Digital Edition : NAVAGEETAM

జిల్లా పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

 

ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగ్జీవన్‌రామ్ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. సామాజిక అసమానతలకు ఎదురు చెప్పుతూ, అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘసంస్కర్త అని  విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన జగ్జీవన్‌రామ్ గారు భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు అన్నారు. మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, సోదరత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలిని ఎస్పీ  అన్నారు. ఆ మహానీయులను స్మరింస్తూ.. మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.