జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా గడ్డం జీవన్ రెడ్డి

నవగీతం,కొడిమ్యాల కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ విషయాన్ని ఫోరమ్ అధ్యక్షులు బొల్లిశెట్టి గంగారెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా గడ్డం జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఫోరమ్ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం, జగిత్యాల శాసన సభ్యులు ఎం. సంజయ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, సర్పంచుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా...