జువ్వాడి నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ లక్ష్మీనారాయణ
నవగీతం,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. లక్ష్మీనారాయణ ఈరోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఐ లక్ష్మీనారాయణకు జువ్వాడి నర్సింగరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం వారు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, కోరుట్ల మండల...