జువ్వాడి ని సన్మానించిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు
నవగీతం,కోరుట్ల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు నియమితులైన సందర్భంగా కోరుట్ల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గుండోజి శ్రీనివాస్ మరియు బొద్దూరి సతీష్ కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నర్సింగరావుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు జువ్వాడి నర్సింగరావుకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో వెలమ సామాజిక వర్గ అభ్యున్నతికి మరియు ప్రజాసేవకు కార్పొరేషన్...