navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:15 pm Digital Edition : NAVA GEETAM

జువ్వాడి రత్నాకర్ రావు 99వజయంతి వేడుకలు

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహణ

జగిత్యాల/ధర్మపురి,అక్టోబర్4,(నవగీతం)

మాజీ మంత్రి, దివంగత జువ్వాడి రత్నాకర్ రావు99వ జయంతి సందర్భంగా ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ హాజరై, దివంగత జువ్వాడి రత్నాకర్ రావు  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్  చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి  పాల్గొని జువ్వాడి రత్నాకర్ రావు  సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రత్నాకర్ రావుమంచితనానికి మారుపేరుగా, కల్మషం లేని మంచి మనసుతో ప్రజలకు సేవలందించిన నాయకుడని పేర్కొన్నారు.ప్రజా ప్రతినిధిగా, రాజకీయ  నాయకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.

అనంతరం జువ్వాడి రత్నాకర్ రావు  చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ సంఘనబట్ల దినేష్  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్  కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.