navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:36 pm Digital Edition : NAVAGEETAM

టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు

నవగీతం, (మల్లాపూర్ ప్రతినిధి):

మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో శనివారం జగిత్యాల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ యాదవ్ హాజరై మాట్లాడుతూ… ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఎంతో అవసరమని నమ్మకమైన కంపెనీ అయిన టాటా ఏఐఏ లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ అసోసియేట్ కొచ్చర్ల కమలా రాణి మాట్లాడుతూ టాటా ఇన్సూరెన్స్ ద్వారా పాలసీదారునికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నారు ప్రతి వ్యక్తికి తమ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కొరకు టాటా ఏఐఏలో ఇన్సూరెన్స్  పాలసీ తీసుకోవాలని కోరారు టాటా ట్రస్ట్ ద్వారా కోటి మందికి లక్ష్యంగా పెట్టుకొని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది అన్నారు అనంతరం వచ్చిన అతిథులకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ టాటా ఏఐఏ లైఫ్ ప్లానర్ మిడిదొడ్డి మల్లేష్ నాయకులు వెంకటరెడ్డి పెద్దిరెడ్డి లక్ష్మణ్ మల్లాపూర్ వార్డు సభ్యులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.