టీటీడీ కళ్యాణ మండపంలో సౌకర్యాలు కల్పించాలి
ఈ-దర్శన్ టోకెన్ కౌంటర్‌ను పునరుద్ధరించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్ మెట్పల్లి,అక్టోబర్27,(నవగీతం): మెట్ పల్లి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో అవసరమైన సౌకర్యాలు కల్పించి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్ కోరారు. మంగళవారం ఆయన టీటీడీ కళ్యాణ మండపాన్ని సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు. మండపం నిర్వహణ, అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలు,...