టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 31 మంది అధికారులు, 266 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం పంపిణీ నవగీతం,తిరుపతి: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవిఎస్వో శ్రీనివాసరావు పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ...