navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 6:25 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ట్రాన్స్‌ఫార్మర్‌కు వినతిపత్రం.. విద్యుత్‌ కోతలపై వినూత్న నిరసన

మల్లాపూర్, సెప్టెంబర్ 4(నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు వినతిపత్రం అందజేసి తన నిరసనను వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన విద్యుత్‌ అధికారులు, సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండటంతో విద్యుత్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్‌ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మల్లాపూర్‌ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలను నివారించి, నిరంతర విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఏనుగు వెంకటరెడ్డి కోరారు.