ట్రాన్స్‌ఫార్మర్‌కు వినతిపత్రం.. విద్యుత్‌ కోతలపై వినూత్న నిరసన

మల్లాపూర్, సెప్టెంబర్ 4(నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు వినతిపత్రం అందజేసి తన నిరసనను వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన విద్యుత్‌ అధికారులు, సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండటంతో విద్యుత్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్‌ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని...