ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రాణాలు కాపాడుకోండి: డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ శ్రీనివాస్
నవగీతం,కోరుట్ల ప్రతినిధి : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిశితంగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం కొరుట్లలో నిర్వహించిన 'ప్రజాపాలన' కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి...