ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రోడ్డు భద్రత అవగాహనపై హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించిన అదనపు ఎస్పీ నవగీతం,జగిత్యాల: ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, వాహనాల వేగాన్ని నియంత్రించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జగిత్యాల పట్టణంలోని ఆర్‌డీఓ చౌరస్తాలో, పోలీస్ శాఖ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీని అదనపు ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో...