navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 5:06 pm Digital Edition : NAVAGEETAM

డబ్బాలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు డబ్బా వర్షకొండ గ్రామంలో శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్బా గ్రామంలో మత్స్య కార్మికులు సొసైటీ చైర్మన్ సల్వాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు. ఈ కార్యక్రమానికి డబ్బా సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్, ఉపసర్పంచ్ రాపల్లి మహేష్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ముదిరాజ్ సంఘ భవనంలో సర్పంచ్ గా గెలిచిన పుప్పాల లక్ష్మి మహేష్ లను, ఉప సర్పంచ్ రాపల్లి మహేష్, వార్డు సభ్యుడు బైండ్ల విశాలు ను ముదిరాజ్ కులస్తులు ఘనంగా సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, హైకోర్టు న్యాయవాది రాపల్లి శివకుమార్ ,డబ్బా గ్రామ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బైండ్ల సంజీవ్, పుప్పాల గజేందర్, కాంగ్రెస్ నాయకులు జాన శంకర్, బొజ్జ నరేందర్, నేమూరి శ్రీనివాస్, రాజారెడ్డి, గరిగే ప్రసాద్, బొజ్జ పెద్ద మల్లయ్య, బొజ్జ అశోక్, బొజ్జ మహేష్, సల్వాల ప్రవీణ్,నేమూరి సత్తన్న, తోకల దావీద్, బొజ్జ మహేష్ , ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.