డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత
మెట్‌పల్లి,సెప్టెంబర్16,(నవగీతం) కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జి డాక్టర్ రఘు కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల డాక్టర్ రఘు తల్లి పుష్పలత మృతి చెందడంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని వారి నివాసానికి బుధవారం ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా పుష్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించిన కవిత, డాక్టర్ రఘు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పుష్పలత ఆత్మకు శాంతి చేకూరాలని...