“డిగ్రీ” విద్యార్థుల సంక్షేమం – కళాశాల సిబ్బంది “లక్ష్యం” : ప్రిన్సిపాల్ డాక్టర్ కే వేంకయ్య ప్రకటన
నవగీతం,మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం కళాశాల సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తారని మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య స్పష్టంగా ప్రకటించారు. మెట్ పల్లి మండలంలోని రాజేశ్వర్ రావు పేటలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున డిగ్రీ కళాశాల సిబ్బంది అధ్వర్యంలో "దోస్త్" అడ్మిషన్ ల కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో...