డ్యూటీలో మద్యం మత్తులో కాంట్రాక్ట్ ఉద్యోగి..!

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్లక్ష్యం.. గ్రామస్థుల్లో ఆందోళన నవగీతం, ఆగస్టు2,ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ విద్యుత్ సరఫరాకు కీలకమైన వర్షకొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆదివారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విధుల్లో ఉన్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి డ్యూటీ సమయంలోనే మద్యం మత్తులో కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.సమాచారం ప్రకారం, సబ్‌స్టేషన్‌లోని కుర్చీలో కూర్చొని మద్యం సేవిస్తున్నట్లు కనిపించిన ఉద్యోగికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టేబుల్‌పై మద్యం గ్లాస్ కూడా కనిపించడం చర్చనీయాంశంగా మారింది....