డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరి.జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
నవగీతం ,వేములవాడ డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ సిబ్బంది శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కార్ల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని...