తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు
నవగీతం, తిరుపతి మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో అనిల్ కుమార్...