navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 5:06 pm Digital Edition : NAVAGEETAM

తెలంగాణ వడ్డేర కార్పోరేషన్ డైరెక్టర్ రేసులో బోసు రాము

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన బోసు రాము వడ్డే రాజ్ గత 2018 నుండి వడ్డెర కులంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న బోసు రాము వడ్డేరాజ్.. గత కొన్ని సంవత్సరాలుగా కులంలో సేవ కార్యక్రమాలు , కుల హక్కులు నేరవేరడం కోసం ప్రయత్నాలు, పోరాటాలు చేస్తున్నారు. గతంలో కుల సంఘంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా పని చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు మొట్టమొదటి ఓబన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ఓబన్న కమిటీ చైర్మన్ గా ఉండి పూర్తి బాధ్యతలు తీసుకుని రాష్ట్ర స్థాయిలో మొట్ట మొదటి విగ్రహం ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా ఉండి కులంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు , వడ్డేరలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా కెటాయించాలి ప్రజా దర్బార్ లో ,ఎమ్మెల్యే ,ఎంపీ, జిహెచ్ఎంసి ప్రజావాణి లో దరఖాస్తు పత్రాలు ఇచ్చి తన వంతు ప్రయత్నం చేశారు.నిజాయితీ ,ఎవరి దగ్గర ఎమి ఆశించకుండా కులం కోసం , కుల అభివృద్ధి కోసం పట్టుదలతో కృషి చేశారు. అలాంటి వ్యక్తి కి వడ్డేర కార్పోరేషన్ డైరెక్టర్ పదవి కావాలి అని జిల్లా వడ్డేర ప్రజలు ,వడ్డేర యువత కోరుకుంటున్నారు.