navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:41 pm Digital Edition : NAVAGEETAM

తేజస్వి సూర్య వ్యాఖ్యలను వక్రీకరించడం సిగ్గుచేటు: బీజేవైఎం నేతలు

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

తెలంగాణ ఉద్యమాన్ని బిజెవైఎం జాతీయ అధ్యక్షులు ఎంపీ తేజశ్వి సూర్య ఎక్కడా కించపరచలేదు అని బీజేవైఎం కోరుట్ల పట్టణ అధ్యక్షులు కాలాల సాయి చంద్, ప్రధాన కార్యదర్శి గుండేటి సాయికుమార్ అన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన మొండి వైఖరి వల్లే వందలాది మంది విద్యార్థులు బలిదానాలు చేసుకోవాల్సి వచ్చిందని, అమాయక విద్యార్థులపై అమానుషంగా లాఠీ ఛార్జీలు చేయించిన కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు.రాజకీయ లబ్ధి కోసం ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరును బిజెవైఎం తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యమకారుల ప్రాణాలతో ఆడుకున్న రక్తచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ నేతలకు బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదు. నిజాలు మాట్లాడితే భయపడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే బిజెవైఎం కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు అని తెలియజేశారు.