navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 7:38 pm Digital Edition : NAVAGEETAM

తోటి రిపోర్టర్ జ్ఞాపకార్థం ఐజేయూ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

తోటి రిపోర్టర్ మిత్రుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ జ్ఞాపకార్థం సోమవారం రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రింట్ మీడియా సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ మంచివాడు మనలో ఒకడు సాటి జర్నలిస్టును కోల్పోవడం చాలా బాధాకరం అని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని వేడుకుంటున్నామని అన్నారు. మన మధ్యలో ఉన్నవాడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ జ్ఞాపకార్థం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ ,అప్రోచ్, సంయుక్త కార్యదర్శి పింజరీ శివకుమార్, కార్యవర్గ సభ్యులు కుర్ర రాజేందర్ , మహేందర్ హైమద్ పట్టణ కౌన్సిలర్లు నరేష్, కాజా అజీమ్, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పుల్ల శ్రీనివాస్ గౌడ్ మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు