దాడుల సంస్కృతి సరికాదు..

దాడిని ఖండిస్తున్న కొడిమ్యాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి సరికాదని అందులోనూ కరీంనగర్ శాసనసభ్యులైనా గంగుల కమలాకర్  ఆఫీసుపై దాడి చేయడం, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి  కారును ధ్వంసం చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని అన్నారు..ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..రాజకీయాలలో విమర్శకు ప్రతి విమర్శ చేయాలి తప్ప ఇలా దాడులు చేయడం సరికాదు అన్నారు..ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో బీహార్ మాదిరి రౌడీయిజంచేసి అల్లకల్లోలం...