దివ్యాంగుల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

నవగీతం,కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల దివ్యాంగుల భవనంలో దివ్యాంగుల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, జువ్వాడి నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసారు. జెండా ఆవిష్కరణ అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, అలాగే ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా దివ్యాంగుల కమిటీ నాయకులు జువ్వాడి నరసింగారావు కి కృతజ్ఞతలు తెలిపి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ...