navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 2:29 pm Digital Edition : NAVA GEETAM

దుబాయ్‌లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ను కలిసిన మల్లాపూర్ గల్ఫ్ కార్మికులు

జగిత్యాల, అక్టోబర్ 11,(నవగీతం)

దుబాయ్ పర్యటనలో ఉన్న కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌ను మల్లాపూర్ మండలానికి చెందిన గల్ఫ్ కార్మిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలపై గళం విప్పాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల సంక్షేమానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వి.వి. రావుపేట్ గల్ఫ్ వ్యవస్థాపకులు పెనుకుల అశోక్, చందు, పెనుకుల మల్లేష్, నరేష్, అశ్వత్ ,మురళి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.