navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 7:58 pm Digital Edition : NAVAGEETAM

ధర్మపురి  బార్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ధర్మపురి స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మపురి కోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి యేగి జానకి సీనియర్ న్యాయవాదులు, న్యాయవృత్తికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఎన్నికల అనంతరం అధ్యక్షులుగా బందేల రమేష్, ఉపాధ్యక్షుడిగా మామిడాల శ్రీకాంత్ కుమార్,ప్రధానకార్యదర్శి రామడుగు రాజేష్,జాయింట్ సెక్రటరీగా ఓరుగంటి చంద్ర శేఖర్,మహిళా ప్రతినిధి గా కలమడుగు కీర్తి లు ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారులుగా గూడ జితేందర్ రెడ్డి,కస్తూరి శరత్ కుమార్ లు వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు, కార్యదర్శి సహా ఇతర సభ్యులు న్యాయసేవకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణం చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ,కోర్టు వసతుల అభివృద్ధి, యువ న్యాయవాదులకు మార్గదర్శకత్వం అందించడం తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు న్యాయవాదుల ఐక్యతను బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, నూతన కమిటీ న్యాయవృత్తి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని ,నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.