navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 8:03 pm Digital Edition : NAVAGEETAM

ధర్మారం గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పై ప్రతిజ్ఞ

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై గ్రామస్థులు ఐక్యంగా ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ మరియు ఆరోగ్య హానులపై అవగాహన కల్పించారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు భూమిని, నీటిని కలుషితం చేస్తాయని వివరించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు అందరూ కలిసి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, పర్యావరణానికి అనుకూలమైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ప్రతిజ్ఞ చేశారు.గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో నింపే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన అడుగుగా గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ రహిత ధర్మారం గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, ఉప సర్పంచ్ గణేష్,పంచాయతీ కార్యదర్శి సల్మా సుల్తాన్,వార్డు మెంబర్ కిరణ్, షాప్ యజమానులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు