ధర్మారం గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పై ప్రతిజ్ఞ
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై గ్రామస్థులు ఐక్యంగా ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ మరియు ఆరోగ్య హానులపై అవగాహన కల్పించారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు భూమిని, నీటిని కలుషితం చేస్తాయని వివరించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు అందరూ కలిసి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, పర్యావరణానికి...