ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వడ్లు రోడ్డుపై పోసి ధర్నా

కలెక్టర్‌ను రప్పించాలని డిమాండ్‌ – రోడ్డుపై బైఠాయించిన రైతులు నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ హైవేపై సోమవారం రైతులు వడ్లు రోడ్డుపై పోసి బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ స్వయంగా ఘటనాస్థలానికి రావాలని డిమాండ్ చేశారు.వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని, తాలు తరుగు పేరుతో నష్టపరుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.ధర్నాకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాజీ...