navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:19 am Digital Edition : NAVAGEETAM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు  

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:

లాభాపేక్షతో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన వ్యాపారులను మండల వ్యవసాయ అధికారి  బి. రాజు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశా మేరకు వేల్పూర్ మండల  కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను మండల తహశీల్దార్ తో కలిసి మంగళవారం రోజున వ్యవసాయ శాఖ, రెవెన్యూ  మరియు పోలీస్ అధికారుల బృందం తో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది . స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్ లు, విత్తన ప్యాకెట్ల లాట్ నంబర్లు, సర్టిఫికేషన్, గడువు తేదీల ను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో  మండల వైశా అధికారి బి.రాజు, తహశీల్దార్ అనిరుద్,పోలీస్ శాఖ సిబ్బంది మరియు ఏఈవో సాయిరాం రాజు పాల్గొన్నారు.