నగల దుకాణంలో గాయపడిన వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

నవగీతం, కరీంనగర్: కరీంనగర్ నడిబొడ్డులో ఉన్న బంగారం షాప్ లో నిన్న జరిగిన దొంగల బీభత్సం అధికారుల మరియు ప్రభుత్వ వైఫల్యం అని జనసేన పార్టీ నాయకులు కాస రాజు అన్నారు  సంఘటన జరిగి 24 గంటలు అవుతున్నా కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోకపోవడం ఈ ప్రభుత్వ విఫలమని అన్నారు. కేంద్రమంత్రి కార్యాలయం ఉన్నటువంటి అతి సమీపంలో ఈ సంఘటన జరగడం రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని అన్నారు ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు....