నలభై ఏళ్ల కాంగ్రెస్ ప్రయాణానికి ముగింపు?..

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త దిశ! (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) జగిత్యాల రాజకీయాల్లో మరో కీలక మలుపు ఆవిర్భవించబోతుంది. ఇది కేవలం ఒక నాయకుడి పార్టీ మార్పు కథ కాదు… నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, నిబద్ధత, ఆశలు, అవమానాలు, మరియు ప్రాంతీయ రాజకీయాల లోతైన అంతర్గత పోరాటాల ప్రతిబింబం. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును మాత్రమే నిర్ణయించదు.. జగిత్యాల రాజకీయ దిశను, ఉత్తర తెలంగాణ శక్తి సమీకరణాలను, కాంగ్రెస్ మరియు...