navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 12:16 pm Digital Edition : NAVAGEETAM

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

నవగీతం,మెట్ పల్లి:

కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఫామ్స్ అందుబాటులో ఉండేల చూసుకోవాలని ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, శాంతియుత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్, మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్, కోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య , రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.