navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 9:47 am Digital Edition : NAVAGEETAM

నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. కలెక్టర్ సత్య ప్రసాద్

నవగీతం,జగిత్యాల:

మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియ లో భాగంగా నోటిస్ బోర్డుపై ప్రదర్శించిన విధానాన్ని పరిశీలించారు.  నామినేషన్ స్వీకరణ సమయంలో  ఆర్వో, ఏ ఆర్వో ల విధులను క్షుణ్ణంగా వివరించారు. అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు అందరిని సమన్వయం చేసుకుంటూ తమ విధులు జాగ్రత్తగా  నిర్వహించాలని అన్నారు.