నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. కలెక్టర్ సత్య ప్రసాద్
నవగీతం,జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియ లో భాగంగా నోటిస్ బోర్డుపై ప్రదర్శించిన విధానాన్ని పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ సమయంలో ...